Dasari Manohar Reddy | పెద్దపల్లి రూరల్, ఆగస్టు 31 : అనారోగ్యం బారిన పడి హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి మండలంలోని గుర్రంపల్లి గ్రామానికి చెందిన అడ్లూరి రమేష్ కూతురు అక్షరను ఆదివారం పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించి మనోధైర్యం నింపారు.
దవాఖాన వైద్యులను కలిసి అక్షరకు మెరుగైన వైద్యం అందించి బాగు చేయాలని సూచించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పి పార్టీపరంగా అన్ని విధాల ఆదుకుంటామని ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే దాసరి వెంట కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ నూనేటి సంపత్ యాదవ్, జెడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి తదితరులున్నారు.