Peddapally | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 20: పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ లో రజక కులస్తుల ఆరాధ్యదైవమైన మడేలయ్య దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 18 నుంచి ప్రారంభమైన ప్రతిష్ట కార్యక్రమంలో ఆదివారం ప్రదాన పూజారుల వేదమంత్రోచ్ఛారణల మధ్య విగ్రహాల ప్రతిష్ట ప్రత్యేక హోమాలు నిర్వహించారు.
ఈ ఉత్సవ వేడుకలకు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో వివిద కులసంఘాల నాయకులు, రజక సంఘం నాయకులు, వివిద పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని రజక సంఘం నాయకులు, బీఆర్ ఎస్ పార్టీ నాయకులు పూల మాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.