Korutla | గణేష్ నిమజ్జన వేడుకలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి.. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్
గణేష్ నిమజ్జన వేడుకలను కోరుట్లలో ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పెద్ద వాగు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు.
Korutla |కోరుట్ల, సెప్టెంబర్ 19 : గణేష్ నిమజ్జన వేడుకలను కోరుట్లలో ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ నగర్ పెద్ద వాగు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఈ నెల 23, 24 తేదీల్లో కోరుట్లలో వినాయక నిమజ్జన వేడుకలను నిర్వహించాలని తెలిపారు.
నిమజ్జనానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం వాగు పరిసరాలలో బారికేడింగ్ ఏర్పాటు చేయాలని, అవసరమైన క్రేన్లను, నిమజ్జనం సమయంలో రద్దీ నియంత్రణ, ప్రజల భద్రత వంటి అంశాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో శానిటేషన్, హైమాస్ లైటింగ్, మంచినీటి సౌకర్యం, ఏర్పాట్లు ఉండేలా చూడాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్, నీటిపారుదల, విద్యుత్, అగ్నిమాపక, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి అవాంచనీయ ఘటనలకు తావులేకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహల తరలింపులో విద్యుత్ షాక్ వంటి ప్రమాదాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, గణేష్ నిమజ్జనం రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలని, నిమజ్జనం రూట్లో అవసరమైన రోడ్డు మరమ్మతుల పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి, తహశీల్దార్ కృష్ణ చైతన్య, సీఐ లక్ష్మీనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

