Chigurumamidi |చిగురుమామిడి, ఆగస్టు 7 : రైతులు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారని సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) ఆకుల ప్రణయ్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఎల్-నినో పంట ప్రణాళికపై గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ వరికి బదులు ఉద్యాన పంటల సాగు, ఆయిల్ ఫామ్ సాగులను రాయితీతో ప్రభుత్వం అందిస్తుందన్నారు.
పామ్ పాండ్ల (వ్యవసాయ చెరువులు) ఏర్పాటుకు సబ్సిడీ అందుతుందన్నారు. ఆసక్తిగల రైతులు ఆసక్తి వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గిట్ల తిరుపతిరెడ్డి వార్డు సభ్యులు సిద్ధంకి అనిల్, కోక్కిస సతీష్, రాచకొండ సంపత్, జీపీవో కొమురయ్య, లైన్ ఇన్స్పెక్టర్ రాజ్ నాయక్, అంగన్వాడీ టీచర్లు పైస పుష్పలత, నర్ర మాధవి లత, ములిపాల అంజలి, ఆశాలు పైస మంజుల, రైతులు పాల్గొన్నారు.