Expired medicines | వ్యవసాయ బావిలో గడువుతీరిన ప్రభుత్వ మందులు.. కోరుట్లలో భారీ ఎత్తున బయటపడ్డ మందులు, వ్యర్థాలు
కోరుట్ల పట్టణం అయ్యప్ప గుట్ట సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో గడువు తీరిన ప్రభుత్వ మందులు, వైద్య వ్యర్థాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి.
Expired medicines | కోరుట్ల, నవంబర్ 5 : కోరుట్ల పట్టణం అయ్యప్ప గుట్ట సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో గడువు తీరిన ప్రభుత్వ మందులు, వైద్య వ్యర్థాలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందించాల్సిన లక్షలాది రూపాయల విలువైన గడువు ముగిసిన మందుల డబ్బాలు, సూదులు, గ్లౌజులు వంటి బయో వ్యర్ధాలు వ్యవసాయ బావిలో ప్రత్యక్షం కావడంతో స్థానికంగా కలకలం రేపింది. తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసినట్టుగా ముద్రలు, బ్యాచ్ నంబర్లు కలిగిన మందులను గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి పారవేసినట్లుగా తెలుస్తోంది.
సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రి లేదా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మందుల లేక ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ పడవేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోని మందులను ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఇష్టా రీతిలో పడవేయడం ద్వారా పర్యవరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. గడువుతీరిన మందులను ప్రత్యేక పద్ధతుల్లో తరలించాల్సి ఉండగా ఇలా నిర్లక్ష్య పూరితంగా వ్యవసాయ బావిలో పడేయటం సరికాదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఈ విషయంలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

