Tree plantation | చిగురుమామిడి, జూలై 9 : మండలంలోని కొండాపూర్ గ్రామంలో గ్రామీణ ఉపాధి పథకం ద్వారా నర్సరీలో పెంచిన ఈత మొక్కలను తిమ్మాపూర్ ఎక్సైజ్ ఎస్సై భారతి కొండాపూర్ లోని ఈతవనంలో బుధవారం మొక్కలు నాటారు. ఎక్సైజ్ ఆధ్వర్యంలో 13 వేల మొక్కలు లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా కొండాపూర్ లో 1000, సుందరగిరిలో 500 ఈతముక్కలను పెద్ద ఎత్తున నాటినట్లు చెప్పారు.
ప్రతీ ఏటా మండలంలోని పలు గ్రామాల్లో ఈత, తాటి, ఖర్జూర మొక్కలను నాటుతున్నామని అన్నారు. మొక్కల సంరక్షణకు గౌడ కులస్తులతో పాటు గ్రామస్తులు సహకరించాలని ఎస్సై భారతి గ్రామస్తులను కోరారు. ఈ మొక్కల నాటే కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బందితోపాటు పంచాయతీ కార్యదర్శి అమృత వర్షిని, ఫీల్డ్ అసిస్టెంట్ సాంబరాజు, కారోబార్ బిగి గణేష్, గౌడ సంఘం అధ్యక్షులు బుర్ర తిరుపతి, నారగోని శ్రీనివాస్, బుర్ర కళ్యాణ్, బుర్ర శ్రీకాంత్, బుర్ర శ్రీనివాస్, గుడాల శ్రీనివాస్, గంగయ్య, సదానందం, రాజయ్య, ఈజీఎస్ కూలీలు పాల్గొన్నారు.