Vemulawada | రెగ్యులర్ ఉద్యోగి వచ్చినా.. తప్పని ప్రైవేటు వ్యక్తుల సేవలు..!
రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయానికి ఇటీవలే స్వామివారికి నైవేద్యాలు, వచ్చిన అతిథుల కోసం చేయాల్సిన ఆహార పదార్థాలు వండేందుకు రెగ్యులర్ ఉద్యోగిని అన్ని పరీక్షలు నిర్వహించి హైదరాబాదులో నియామక పత్రాన్ని అందజేశారు.
- రాజన్న ఆలయంలో ఘనంగా ప్రారంభమైన వేద సభలు
- ఐదు రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు
- అతిథి మర్యాదల కోసం ప్రైవేట్ వ్యక్తులతో అందిస్తున్న సేవలు
Vemulawada | వేములవాడ, జూలై 22 : రాష్ట్ర ప్రభుత్వం వేములవాడ రాజన్న ఆలయానికి ఇటీవలే స్వామివారికి నైవేద్యాలు, వచ్చిన అతిథుల కోసం చేయాల్సిన ఆహార పదార్థాలు వండేందుకు రెగ్యులర్ ఉద్యోగిని అన్ని పరీక్షలు నిర్వహించి హైదరాబాదులో నియామక పత్రాన్ని అందజేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా వేములవాడ రాజన్న ఆలయ సన్నిధిలో మంగళవారం నుండి ప్రారంభమైన వేద సభలకు ఐదు రాష్ట్రాల నుండి వేద విద్యార్థులు వేద అధ్యాపకులు దాదాపు 200 మంది వరకు వచ్చారు. దీంతో ప్రతీరోజు వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రికి కావాల్సిన భోజనాలను కూడా తయారుచేసి అందించాల్సి ఉంటుంది. అయితే వంట మనిషిని అయితే నియమించారు. కానీ అతని సేవలు అంతంత మాత్రమేనని తెలుస్తోంది.
ఇంకా బుధవారం వచ్చిన అతిథిల కోసం ఆహార పదార్థాలను ప్రైవేటు బ్రాహ్మణ వంట వ్యక్తితో వంటలు చేయిస్తుండడం ఇందుకు నిదర్శనం. రెగ్యులర్ ఉద్యోగి నియమించి 30వేల రూపాయల వేతనం ఇవ్వబోతున్న రాజన్న ఆలయంలో జరిగే ముఖ్య కార్యక్రమాలకు ప్రైవేటు వ్యక్తులని ఆశ్రయించాల్సి వస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే నియామకమైన వంట మనిషి సామర్థ్యాన్ని గుర్తించకుండా నియామకం జరిగినందు వల్లే మళ్లీ ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆరోపణలు కూడా వస్తున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

