Jagityal | జగిత్యాల : అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన పేర్కొన్నారు. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ కార్యవర్గ సభ్యుడు డిక్కి, జిల్లా కో ఆర్డినేటర్ నల్ల శ్యామ్ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె అంబేద్కర్ విగ్రహానికి ఆదివారం నివాళులర్పించారు.
దేశానికి అంబేద్కర్ అందించిన అమూల్యమైన సేవలు, సమానత్వం, న్యాయం సామాజిక సంస్కరణలో వారి ఆలోచనలు, ఆశయాలను, ఆదర్శల ద్వారా భవిష్యత్ తరాలు స్ఫూర్తి పొందటంతో పాటు స్మరించుకోవాలని ఈ కార్యక్రమం ప్రతీ ఆదివారం నిర్వహిస్తున్నామని నల్ల శ్యామ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో మద్దెల నారాయణ, ఆనంతుల కాంతారావు, తక్కళ్ళ దేవయ్య, నల్ల బొల్లం ప్రభాకర్, బొట్ల విజయ్ రతన్, దాసరి లచ్చయ్య, పల్లె రవి, రాగం రమేష్, తూము వెంకటేష్, కూనమళ్ళ రాజం, సంకె మహేష్, బాసమల్ల చంద్రశేఖర్, గాదం రాజేశం, దాసరి ప్రవీణ్, కూనమల్లా గంగాధర్, సంగ మల్లేశం, బుయ్య శాంతయ్య, మూగల జలందర్, బత్తుల రాజేందర్, నకుమల్ల నరేందర్, జవ్వాజి శంకర్, అంబేద్కర్ వాదులు తదితరులు పాల్గొన్నారు.