హౌసింగ్ బోర్డు కాలనీ, డిసెంబర్ 21 : కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో సూల్లో ఏర్పాటు చేసిన ‘మ్యాథ్స్ మెజెస్టీ’ వేడుకలను అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ నేటి తరానికి గొప్ప మార్గదర్శకులని, నూతన అధ్యాయానికి నాంది పలికిన మహనీయుడని కొనియాడారు. ఉత్సవాలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన మ్యాజిక్ మ్యాట్రిక్స్, రోబో సరిల్, క్యూబ్ బిల్డింగ్, పలు నమూనాలు ఆలోచింపచేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు.