Doctorate | వీణవంక, ఏప్రిల్ 11 : మామిడాలపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి నవీన్ రెడ్డి డాక్టరేట్ పొందారు. కాగా ఆయనకు గ్రామస్తులు శుక్రవారం అభినందలు తెలిపారు. మండలంలోని మామిడా లపల్లి గ్రామానికి చెందిన గుడిపాటి వెంకట్ రెడ్డి-అరుణ దంపతుల కుమారుడు నవీన్ రెడ్డి అస్సాం లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డాక్టర్ అంజుమొని దేవి ఆధ్వర్యంలో పీహెచ్డీ పూర్తి చేసుకొని అధికారికంగా అస్సాం రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. నవీన్ రెడ్డి డాక్టరేట్ అందుకోవడం పట్ల గ్రామస్తులు అభినందలు తెలిపారు.