KTR | అధైర్య పడొద్దు.. అండగా ఉంటా.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
‘అధైర్య పడవద్దు.. అండగా ఉంటా..’ అని సిద్దిపేటలో దవాఖానలో చికిత్స పొందుతున్న ముస్తాబాద్ మండలం బంధనకల్ చెందిన యువకుడు జశ్వంత్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు.
- జశ్వంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన కేటీఆర్
- మెరుగైన వైద్యం చేయిస్తామని భరోసా
KTR | రాజన్న సిరిసిల్ల, నవంబర్ 25 ( నమస్తే తెలంగాణ) : ‘అధైర్య పడవద్దు.. అండగా ఉంటా..’ అని సిద్దిపేటలో దవాఖానలో చికిత్స పొందుతున్న ముస్తాబాద్ మండలం బంధనకల్ చెందిన యువకుడు జశ్వంత్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ నెల 23 న రాత్రి ముస్తాబాద్ మండలం వెంకయ్య కుంట శివారులో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముస్తాబాద్ మండలం బంధనకల్ కు చెందిన యువకులు మణికుమార్ అలియాస్ మహేందర్ రెడ్డి (25) సంఘటన స్థలంలో మృతి చెందగా, 24న భరత్ యువకుడు సైతం మృతి చెందాడు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జశ్వంత్ సిద్దిపేటలోని దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. ఎర్రబెల్లిలోని కేసీఆర్ నివాసంలో పనిచేస్తున్న మణికుమార్ మృతి చెందగా, కేసీఆర్‌తో సహా కేటీఆర్ కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం అంత్యక్రియలకు మాజీ ఎంపీలు సంతోష్ కుమార్, కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిగత సిబ్బంది హాజరై పాడేమోసి వారి కుటుంబానికి కేసీఆర్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
జస్వంత్ కు మెరుగైన వైద్య సహాయం
సిద్దిపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జశ్వంత్ ఆరోగ్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఆరా తీశారు. సర్పంచ్ నరేష్ ఫోన్ నుంచి రోడ్డు ప్రమాద బాధితుడి తండ్రితో మాట్లాడారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని, తొందరగా కోలుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ధైర్యంగా ఉండాలని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- Karimnagar
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | రోడ్డు ప్రమాద బాధితుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా
Exercise | వ్యాయామం చేయకముందు, చేసిన తరువాత ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..?
Sai Pallavi | సాయిపల్లవి నయా షేడ్.. ఇక కమర్షియల్ హీరోయిన్గా..!
AP Rains | ఏపీలో మరో రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
Vijayasai Reddy | కాంగ్రెస్‌కు వైఎస్ జగనే వెన్నుపోటుదారుడు : పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

