హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు చేసిన వారిపై వీరోచితంగా పోరాట చేసిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను సోమవారం జిల్లా వ్యాప్తంగా జరుపుకొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ మహనీయుడి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదర్శప్రాయుడైన శివాజీని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లో ఛత్రపతి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక వాహనంపై వీధుల్లో శోభాయాత్ర చేశారు.
– వేములవాడ/ వేములవాడ రూరల్/ఎల్లారెడ్డిపేట/ఇల్లంతకుంట/చందుర్తి/ సిరిసిల్ల రూరల్/గంభీరావుపేట/ కోనరావుపేట, ఫిబ్రవరి 19
వేములవాడ రూరల్ మండలం జయవ రం, అయ్యేరుపల్లిలో ఆరె సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ప్రభు త్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛత్రపతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన గొప్ప పేరు ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. అలాగే ఆరెపల్లి, బొల్లారం గ్రామాల్లో ఆరె సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించా రు. ఇక్కడ జిల్లా అధ్యక్షుడు సిలువేరి మల్లేశం, మండలాధ్యక్షుడు నరేశ్, తదితరులు ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో ఛత్రపతి శివాజీ జయంతిని నిర్వహించారు. వెంకటాపూర్‌లో శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా, గొల్లపల్లిలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి వీధుల్లో శోభాయాత్ర చేపట్టారు.
ఇల్లంతకుంటలోని బస్టాండ్ ఆవరణలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేడుకల్లో వీహెచ్‌పీ మండలాధ్యక్షుడు ఎగుర్ల శ్రీనివాస్, ఎంపీటీసీ ఒగ్గు నర్స య్య, డాక్టర్ జగన్మోహన్రావు, మామిడి పరశురాం, బాలరాజు, రాంసేటు, రాజు, కిష న్, సత్యనారాయణ, రాజేశ్వరశర్మ, శ్రీహరి, విజయ్, శ్రీనివాస్, వెంకటేశం ఉన్నారు.
తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంత రం రాగుల బాలయ్య కుటుంబానికి 50కిలో ల బియ్యం అందించారు. ఇక్కడ అధ్యక్షుడు కాసుగంటి రాజు, సభ్యులు ఉన్నారు.
చందుర్తి మండల కేంద్రంతోపాటు జోగాపూర్, మర్రిగడ్డ, మల్యాల గ్రామాల్లో యువజన సంఘాలు, నాయకులు శివాజీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. తర్వాత పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మర్రిగడ్డ ఛత్రపతి యూత్ సభ్యుల ఆధ్వర్యం లో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఇకడ జడ్పీటీసీ నాగం కు మార్, నాయకులు శ్రావణ్, నేతికుంట రాజు, బొడిగ హరీశ్, బాలరాజు, శేఖర్, వేణు శ్రీకాం త్, వికాస్, తదితరులు ఉన్నారు.
గంభీరావుపేటలో హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి విగ్రహంతో ర్యాలీ నిర్వహించారు. డప్పుచప్పుళ్ల మధ్య యువకులు నృత్యం చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు.
కోనరావుపేట మండల కేంద్రంతోపాటు మామిడిపల్లి, నాగారం, మల్కపేటలోని ప్రధా న కూడళ్లలో ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఇక్కడ ఎంపీటీసీ మిర్యాల ప్రభాకర్‌రావు, నేతలు జితేందర్‌రెడ్డి, తిరుపతి, తదితరులు ఉన్నారు.
వేములవాడ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలోఛత్రపతి శివాజీ జయంతి నిర్వహించారు. ఇక్కడ పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్ రేగుల సం తోష్బాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహేశ్, నాయకులు హన్మాండ్లు, గుడిసె మనోజ్, రేగుల రాజ్‌కుమార్ ఉన్నారు.