Purchasing centers | కాల్వ శ్రీరాంపూర్, మే 3 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి, మొ ట్లపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీటీసీఎస్ జి రవీందర్ రెడ్డి, మహేష్ లు పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా రశీదులను పరిశీలించారు. వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున టార్ఫాలీన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ధాన్యాన్ని త్వరితగతిన కాంటాలు వేసి మిల్లులకు పంపించాలన్నారు