Veenavanka | వీణవంక, నవంబర్ 19 : వీణవంక మండలంలోని ఎనిమిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవీ, తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్లో పదో తరగతి చదువుతున్న 266 మంది విద్యార్థులకు బుధవారం గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో దాత గంగిశెట్టి జగదీశ్వర్, ఆయా పాఠశాలల హెచ్ఎంల చేతుల మీదుగా పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మోయిజ్ బేగ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా రిటైర్ అయి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు వారి తల్లి గంగిశెట్టి మధురమ్మ ట్రస్టు పేరుమీద అందజేయడం హర్షించదగిన విషయమన్నారు. ఈ సంవత్సరం పదివేల మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దాత గంగిశెట్టి జగదీశ్వర్, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.