తిమ్మాపూర్ రూరల్, జనవరి 10: రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సోమవారం మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ 14 కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రేణికుంట, నుస్తులాపూర్, కొత్తపల్లి, ఇందిరానగర్, రామకృష్ణకాలనీ గ్రామాల్లో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి చెక్కులు అందజేశారు. రేణికుంట, రామకృష్ణకాలనీ గ్రామాల్లో బైక్‌పై పర్యటించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అనిత, ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు రావుల రమేశ్, సర్పంచులు జితేందర్‌రెడ్డి, బోయిని కొమురయ్య, కాటిక వినోద, మీసాల అంజయ్య, ఎంపీటీసీలు కొత్త తిరుపతిరెడ్డి, కిన్నెర సుజాత, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రైతుగా మారిన రసమయి..
కేశవపట్నంలో నిర్వహించిన రైతుబంధు సంబురాలకు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు. రైతు వేషం ధరించి, ఎడ్లబండిపై స్వారీ చేస్తూ రైతువేదిక వద్దకు రావడంతో రైతులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా మండలంలోని వివిధ క్లస్టర్లలో నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
బహుమతుల ప్రదానం
రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా మానకొండూర్ మండలంలోని రైతు వేదికల్లో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి మానకొండూర్ రైతు వేదికలో సోమవారం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు బహుమతులు ప్రదానం చేశారు. కొండపల్కలకు చెందిన గోస్కుల బన్నీ వ్యాస రచన, ఉపాన్యాస పోటీల్లో మొదటి బహుమతి పొందాడు. ఇక్కడ ఎంపీపీ ముద్దసాని సులోచన, జడ్పీటీసీ శేఖర్‌గౌడ్, రైతు బంధు సమితి గ్రామ కన్వీనర్ కడారి ప్రభాకర్, టీఆర్ఎస్ మహిళా మండలాధ్యక్షురాలు బొంగోని రేణుక తదితరులు ఉన్నారు.