Peddapally DLPO | పెద్దపల్లి రూరల్, నవంబర్ 3 : పెద్దపల్లి డీఎల్పీవోగా దేవకీదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు పెద్దపల్లి డీఎల్పీవోగా పని చేసిన వేణుగోపాల్ రావు పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో గతంలో పెద్దపల్లి డీఎల్పీవోగా పని చేసిన దేవకీదేవినే మళ్లీ పెద్దపల్లి డీఎల్పీవోగా నియమించడంతో ఆమె సోమవారం విధుల్లో చేరారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్షుడు దేవరనేని నిశాంత్ రావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు డీఎల్పీవోను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించి స్వాగత శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శులు శరత్ బాబు తదితరులున్నారు.