తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టు ( Kondagattu) కు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్( Pawan Kalyan) పర్యటన ఖరారయ్యింది. శనివారం ఉదయం స్వామివారిని దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD ) సమకూర్చే రూ. 35.13 కోట్ల నిధులతో నిర్మించనున్న దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలశంకుస్థాపన చేయనున్నారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు.
టి.టి.డి. బోర్డు శనివారం నిర్వహించే కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు , ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , టీటీడీ బోర్డు మెంబర్లు బి.ఆనందసాయి తదితరులు పాల్గొననున్నారు. పవన్ కల్యాణ్ రాక సందర్భంగా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు.