ప్రమాదంలో రైతుల ఖాతాలు
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ఇటీవల నిర్వహించగా, అందులో నిరార్థక ఖాతాలుగా రైతుల అకౌంట్లు మారినట్లు వెలుగు చూసింది.
- పంటరుణం చెల్లించని అకౌంట్లపై బ్యాంకుల ఫోకస్
- స్తంభింపజేయాలని నిర్ణయం?
- ఇదే జరిగితే భవిష్యత్తులో మళ్లీ రుణాలు గగనమే
- ఆందోళనలో అన్నదాతలు
- రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
రైతుల బ్యాంకు ఖాతాలు ప్రమాదంలో పడనున్నాయా..? అంటే ఔననే సంకేతాలు వస్తున్నాయి. పంట రుణాలు పొంది నిర్దేశిత గడువులోగా చెల్లించని వారి అకౌంట్లను నిలిపివేయాలని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే ఈ నిర్ణయం రైతుల పాలిట ఆశనిపాతం కానుంది. భవిష్యత్తులో మళ్లీ రుణాలు పొందడం గగనమే అవుతుందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీపై సర్కారు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
జగిత్యాల, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం ఇటీవల నిర్వహించగా, అందులో నిరార్థక ఖాతాలుగా రైతుల అకౌంట్లు మారినట్లు వెలుగు చూసింది. గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం రెండు పర్యాయాలు పంట రుణాలు మాఫీ చేయడం, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల సమయంలో రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు పంట రుణాలు కొన్నేండ్లుగా సరిగా చెల్లించని విషయం తెలిసిందే. అయితే, రైతులు తీసుకున్న పంట రుణాలకు అసలు కాదు కదా..? కనీసం వడ్డీ సైతం చెల్లించకపోవడంతో ఆ రైతుల ఖాతాలన్నింటినీ నిరర్థకమైన (నాన్ పర్ఫామింగ్ అకౌంట్స్)గా గుర్తించిన బ్యాంకర్లు వాటిని స్తంభింపజేసినట్లు తెలుస్తున్నది.
నాన్ పర్ఫామింగ్ ఖాతాలుగా గుర్తింపు పొందిన అకౌంట్లకు భవిష్యత్తులో రుణాలు ఇవ్వరాదని నిర్ణయించడంతోపాటు వారు పూచీకత్తు ఇచ్చిన ఆస్తులను జప్తు చేయడం, వేలం వేసే జాబితాలో చేర్చినట్లుగా తెలుస్తున్నది. బ్యాంకర్ల ఈ నిర్ణయం నేపథ్యంలో ఒక్క జగిత్యాల జిల్లాలోనే దాదాపు లక్షకుపైగా ఖాతాలు స్తంభించే ప్రమాదంలో ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో 99 వేలకు పైచిలుకు మంది రైతులు 413 కోట్ల పంట రుణాలను పొందారు. అందులో ఎందరు పంట రుణాలు చెల్లించారు? ఎందరు చెల్లించలేదు? కనీసం వడ్డీ చెల్లించిన వారెందరు? అన్న విషయంపై అధికారులకు సైతం పూర్తిస్థాయిలో అవగాహన లేదు. అయితే, పంట రుణాలు పొందిన వారిలో 95 శాతం మంది రైతులు పంట రుణమాఫీ జరుగుతుందన్న నమ్మకంతో పంటరుణాలు చెల్లించడం మానివేసినట్లు బ్యాంకు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. బ్యాంకర్ల నిర్ణయం నేపథ్యంలో జిల్లాలో పెద్ద సంఖ్యలోనే రైతుల ఖాతాలు స్తంభించిపోయే ప్రమాదమున్నది.
2 లక్షల రుణమాఫీ ఎప్పుడో?
సీఎం రేవంత్‌రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తామని, కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ ప్రక్రియ చేపడుతామని ప్రకటించిన విషయం విదితమే. అయితే, రుణమాఫీ ఎప్పుడు చేస్తారన్న విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. రైతులు తీసుకున్న మొత్తానికి రుణమాఫీ చేస్తారా..? వడ్డీని సైతం కలుపుకొని చేస్తారా..? గతంలో మిగిలిపోయిన రుణాలు సైతం మాఫీ అవుతాయా..? ఎవరైనా రైతులు రుణాలు తీసుకొని చెల్లిస్తే వారికి ఏ విధమైన ప్రోత్సాహకాలు ఇస్తారా..? తదితర అంశాలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. ఇదే సమయంలోనే బ్యాంకర్లు ఎన్పీఏ ఖాతాలుగా గుర్తించి, ఆస్తులు జప్తు చేయడం, వేలం వేసే కేటగిరీలో చేర్చారన్న విషయంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఖాతాలు సీజ్ అయితే తాము భవిష్యత్తులో ఇతర రుణాలు తీసుకొనే అవకాశం ఉండదని, ఆర్థిక వ్యవహారాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రూ.2 లక్షల రుణమాఫీ చేపట్టాలని, రైతుల బ్యాంకు ఖాతాలను నాన్‌పర్ఫామింగ్ అకౌంట్స్ విభాగం నుంచి బయటపడేలా చూడాలని కోరుతున్నారు.
తగ్గిపోయిన రుణాల చెల్లింపులు
2014 ఎన్నికల్లో హామీ ఇచ్చిన అప్పటి ప్రభుత్వం 2016లో రుణమాఫీ చేసింది. అయితే, రూ.లక్షకు పైగా రుణం తీసుకున్న రైతులు చాలా ఏండ్లుగా రుణం చెల్లించకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. ప్రస్తుతం ఇటీవలీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ రైతులకు సంబంధించి 2 లక్షల రుణమాఫీని ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2 లక్షల పంట రుణాలను రైతులు తీసుకోవాలని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని మాఫీ చేస్తామని ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన సంగతి విధితమే. ఇలా గత ప్రభుత్వం రుణమాఫీ చేయడం, ప్రస్తుత ప్రభుత్వం సైతం రుణమాఫీ గత ప్రభుత్వం కంటే రెట్టింపుగా చేస్తామని చెప్పడంతో రైతులు రుణాలు తీసుకొని వాటిని చెల్లించలేదు.
అసలు కాదు కదా కనీసం వడ్డీని సైతం చెల్లించడం నిలిపివేశారు. పంట రుణాల నిబంధన ప్రకారం రైతులు తీసుకున్న రుణాన్ని పంట దిగుబడి వచ్చిన తదుపరి ధాన్యం విక్రయం అనంతరం ఏడాదికి ఒక్కసారి రుణం బ్యాంకులకు తిరిగి చెల్లించాలి. ఏడాదిలో రుణం చెల్లిస్తే, రైతుకు వడ్డీలో కొంత రాయితీని ఇవ్వడంతోపాటు మరుసటి ఏడాదికి సంబంధించి పంట రుణాలను బ్యాంకులు ఇస్తూ వచ్చాయి. ఇక దీర్ఘకాలిక రుణాలు, పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్న రైతులు ఆరు నెలలకు ఒకసారి కిస్తీలు చెల్లించాలన్నది నిబంధన.
ఈ నిబంధనలు పాటించకపోతే బ్యాంకర్లు ముందుగా రైతులకు సంబంధించిన ఖాతాలను ఎన్పీఏ ఖాతాలుగా ప్రకటించి రైతులపై ఒత్తిడి తీసుకువచ్చి రుణాలను వసూలు చేసుకునేది. ఖాతాలు స్తంభించినా, రైతుల వద్ద నుంచి రుణమొత్తాలు రాకపోతే, వారు బ్యాంకులో పెట్టిన పూచికత్తులను, సొంత ఆస్తులను జప్తు చేసుకోవడం, వేలం వేసే ప్రక్రియలకు శ్రీకారం చుడుతామని చెప్పేవారు. ఇది సహజంగా బ్యాంకులు నిర్వహించే ప్రాసెస్. అయితే దశాబ్దకాలంగా ఈ వ్యవహారం కనిపించడం లేదు. రైతులు రుణమాఫీకి సంబంధించిన చెల్లింపులు 90శాతానికిపైగా తగ్గిపోయాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

