Peddapally | ఉద్యమంలో దీక్షా దివస్ చారిత్రాత్మక మలుపు.. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి
తెలంగాణ ఉద్యమంలో 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ చరిత్రాత్మక మలుపుగా నిలిచిపోయిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. నాడు కేసీఆర్ చేసిన పోరాటాలను నేటి యువతకు తెలియజేయాలనే సంకల్పంతో పెద్దపల్లిలో దీక్షా దివస్-2026 నియోజకవర్గ క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు దాసరి పేర్కొన్నారు.
- దీక్షా దివస్-2026 నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నిని ప్రారంభించిన దాసరి
Peddapally | పెద్దపల్లి కమాన్ : తెలంగాణ ఉద్యమంలో 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్ చరిత్రాత్మక మలుపుగా నిలిచిపోయిందని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. నాడు కేసీఆర్ చేసిన పోరాటాలను నేటి యువతకు తెలియజేయాలనే సంకల్పంతో పెద్దపల్లిలో దీక్షా దివస్-2026 నియోజకవర్గ క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు దాసరి పేర్కొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం క్రికెట్ టోర్నిని ఆయన టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే నినాదంతో చేపట్టిన నిరాహార దీక్ష వల్లే యావత్ తెలంగాణ సమాజం ఒక్కటై రాష్ట్ర సాధనకు మార్గం సుగమమైందని గుర్తు చేశారు. ఆ త్యాగాల ఫలితంగానే నేడు మనం ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామని చెప్పారు.
యువతకు ఆనాటి ఉద్యమ ఘట్టాలను, పోరాటాలు నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమానికి పూనుకున్న పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, టోర్నమెంట్ నిర్వాహకులు రేవెల్లి స్వామి, కనుకుర్తి కార్తీక్ ను ఈ సందర్భంగా దాసరి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్ వెన్నం సుజాత రవీందర్, పట్టణ నాయకులు పూదరి చంద్రశేఖర్, కాశీపాక వాసు, జుబేర్, ముకీం, బైరం నటరాజ్, అజార్, వైద శ్రీనివాస్, ఫహీం, అతిక్, ముబాషీర్, ఎడ్ల మల్లేశం, బొడ్డుపల్లి రమేష్, నాగుల మల్యాల శ్రావణ్ కుమార్, పిట్టల మహేష్, మండల నాయకులు సలేంద్ర రాములు, సలేంద్ర లక్ష్మణ్, పెంచాల శ్రీకాంత్, ముత్యం లక్ష్మణ్, దాసరి సతీష్, బాలసాని శ్రీనివాస్ క్రీడాకారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayasai Reddy | కాంగ్రెస్‌కు వైఎస్ జగనే వెన్నుపోటుదారుడు : పీఆర్పీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి
Skin Care | పగలు, రాత్రిని బట్టి చర్మాన్ని భిన్నంగా సంరక్షించాల్సిందే.. ఎందుకంటే..?
Suvendu Adhikari | మోదీతో కలిసి పనిచేయాలని ప్రణబ్ ముఖర్జీ సలహా ఇచ్చారు: సువేందు అధికారి
‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
మందుల్లేని ప్రభుత్వ ఆస్పత్రులు… రోగులకు తిప్పలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

