Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్, నవంబర్ 27 : కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి లో సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి నామినేషన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు.
డీసీపీ రాం రెడ్డికి ఏసీపీ గజ్జి కృష్ణ పూల మొక్కతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకుని స్టేషన్ రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై వెంకటేష్ పాల్గొన్నారు.