state level painting | చిగురుమామిడి, ఆగస్టు 18: చిగురుమామిడి మండల కేంద్రంలోని డార్విన్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు చిత్రలేఖనంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులను సాధించారు. ఆర్టిక విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం ను పురస్కరించుకొని రాష్ట్రస్థాయి చిత్రలేఖనం 2025 పోటీలు ఇటీవల నిర్వహించారు.
కాగా డార్విన్ హై స్కూల్ విద్యార్థులు విద్యా శ్రీ ప్రథమ బహుమతి, బీ అంజన్ కుమార్ ద్వితీయ బహుమతులను సాధించారు. వీరికి నిర్వాహకులు ప్రశంస పత్రాలు అందజేశారు. రాష్ట్రస్థాయిలో చిత్రలేఖనంలో ప్రతిభ కనబరచడం పట్ల పాఠశాల కరస్పాండెంట్ కే. సమ్మిరెడ్డి, కె. దమయంతి, ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.