RTP E-Challan | ఈ-చలాన్ పేరుతో సైబర్ వల.. ఏపీకే ఫైల్ పంపి బురిడీ
ఈ-చలాన్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ‘ఈ-చలాన్’ జీవితకాలం పాటు పూర్తిగా ఉచితం. ఇప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. ఆలస్యం చేయకండి..’ అంటూ వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలతోపాటు ఏపీకే ఫైళ్లను పంపిస్తున్నారు.
- యాప్ తెరిస్తే వ్యక్తిగత సమాచారం గల్లంతయ్యే ప్రమాదం
RTP E-Challan | శంకరపట్నం, సెప్టెంబర్ 15 : ఈ-చలాన్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపారు. ‘ఈ-చలాన్’ జీవితకాలం పాటు పూర్తిగా ఉచితం. ఇప్పుడే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. ఆలస్యం చేయకండి..’ అంటూ వాట్సాప్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలతోపాటు ఏపీకే ఫైళ్లను పంపిస్తున్నారు. ఈ సందేశాలను చూసి వాహనదారులు ఆందోళనకు గురై ఏపీకే ఫైల్‌ను మొబైల్లో ఇన్స్టాల్ చేస్తే వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలు సైబర్ నేరగాళ్లకు చేరే ప్రమాదం ఉంది.
అప్రమత్తతే రక్షణ
ఈ-చలాన్ ఉందో లేదో తెలుసుకోవడానికి గుర్తుతెలియని లింకులు, ఏపీకే ఫైళ్లను ఉపయోగించకుండా అధికారిక ఈ-చలాన్ వెబ్సైట్ ద్వారానే వివరాలు పరిశీలించాలి. అనుమానాస్పద యాప్‌లను ఇన్స్టాల్ చేయకూడదు. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దు. ఇప్పటికే ఇలాంటి ఏపీకే ఫైల్‌ను ఇన్స్టాల్ చేసి ఉంటే వెంటనే తొలగించి, అనుమానాస్పద లావాదేవీలు ఉంటే 1930కు సమాచారం ఇవ్వాలి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
Belraj Kalarickal | తొలి వెబ్‌సిరీస్ విడుదలైన తెల్లారే గుండెపోటుతో యువ దర్శకుడు మృతి..!
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

