Godavarikhani | కోల్ సిటీ, జూన్ 27: గోదావరిఖని విఠల్ నగర్ మీసేవా కేంద్రం ఎదుట ప్రధాన కాలువపై ఉన్న కల్వర్టు క్రమంగా కూలిపోతుంది. రోజుకింత నెర్రలు వారుతూ కుంగిపోతుంది. ఎప్పుడు పూర్తిగా కాలువలో పడిపోతుందో తెలియని పరిస్థితి ఉంది. ప్రతీ రోజూ ఇదే మార్గంలో నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రమాదభరితంగా ఉన్న ఈ కల్వర్టు వద్దకు రాగానే భయంతో వెళ్తున్నారు.
గతంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ డివిజన్ సందర్శనకు వచ్చినప్పుడు ఇదే కల్వర్టు వద్ద అగి పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కానీ అధికారులు మరిచిపోయారు. ప్రస్తుతం ఆ కల్వర్టు పూర్తిగా కుంగిపోయి ఏక్షణాన కూలుతుందో తెలియదని స్థానికులు భయపడుతున్నాడు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారా..? కల్వర్టు పూర్తిగా కూలిపోయిన తర్వాత వస్తారా…? అంటూ ప్రశ్నిస్తున్నారు.