Chigurumamidi | విద్యార్థులకు ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నో బ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా మోడల్ ఎలక్షన్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల విధానం, ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ
Chigurumamidi | చిగురుమామిడి సెప్టెంబర్ 19 : చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నో బ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా మోడల్ ఎలక్షన్స్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. విద్యార్థులకు ఎన్నికల విధానం, ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎన్నికల ప్రక్రియను ఆచరణాత్మకంగా పరిచయం చేశారు. అభ్యర్థుల ఎంపిక, ఓటు వేయడం, ఓట్ల లెక్కింపు తదితర అంశాలను విద్యార్థులు స్వయంగా పాల్గొని తెలుసుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు ఉన్న ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ మోడల్ ఎలక్షన్ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పీ లక్ష్మణరావు మార్గదర్శకత్వం వహించారు. విద్యార్థులు, విద్యార్థుల తల్లదండ్రులు ఉత్సాహంగా పాల్గొని ఎన్నికల ప్రక్రియను ప్రత్యక్షంగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ రమాదేవి, సీహెచ్. జోష్న, షర్మిల, శంకర్, చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

