Congress party Candidate Arrested | తిమ్మాపూర్ డిసెంబర్ 11: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్యం ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలంలోని మన్నెంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సుధగోని లక్ష్మీనారాయణ గౌడ్ భార్య శారద పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తున్నది.
ఈ క్రమంలో గ్రామంలో అధికార అండతో మద్యం పంచేందుకు మన్నెంపల్లి గ్రామానికి చెందిన బూడిద శ్రీనివాస్, తుమ్మల రమేష్ ద్వారా తరలిస్తుండగా నల్లగొండ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ చేతికి చిక్కారు. దీంతో అధికార పార్టీకి చెందిన పలువురు నాయకులు పైరవీలు చేసినప్పటికీ.. ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి, దాదాపు వంద క్వార్టర్లు, రెండు ఫుల్ బాటిల్స్ సీజ్ చేశారు.