తిమ్మాపూర్, సెప్టెంబర్ 10: కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గురువారం ఉదయం తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామ సర్పంచ్ దాట్ల తిరుపతిపై మస్తులాపూర్ సొసైటీ చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు మోరపల్లి రమణారెడ్డి దాడి చేసి గాయపరిచాడు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గ్రామ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమానికి సర్పంచ్ తో పాటు సొసైటీ చైర్మన్ వెళ్లారు. ఈ క్రమంలో పాత కక్షలు పెట్టుకున్నా రమణారెడ్డి.. సర్పంచ్ తిరుపతి రాగానే కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
గ్రామస్తులు అడ్డుకొని వివాదాన్ని సద్దుమణిగించారు. తీవ్రంగా గాయపడ్డ తిరుపతి ఎల్ఎండీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్ పైనే దాడి చేస్తే తమ పరిస్థితి ఏంటి అనే ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల ఫోరం నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు రావుల రమేష్, దేవేందర్ రెడ్డి, అశోక్ రెడ్డి, సంపత్, సర్పంచులు పొన్నం సునీత అనిల్ గౌడ్, ఆంజనేయులు, గుజ్జుల శ్వేతా ప్రణీత్ రెడ్డి, కనకం లక్ష్మీ కొమురయ్య, శ్రీనివాస్, సతీష్, తదితరులు తిరుపతికిమద్దతుగా వచ్చారు.