కొడిమ్యాల, మే 18 : మండలంలోని నాచుపల్లి జేఎన్టీయూ కళాశాలకు మూడు సర్టిఫికెట్లు వచ్చినట్టు కళాశాల ప్రిన్సిపాల్ కామాక్షి ప్రసాద్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జేఎన్టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్రావు సమక్షంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ (ఐఎస్వో) సంస్థ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సర్టిఫికెట్లు అందజేసినట్లు చెప్పారు.
ఒకటి ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్ మేనేజ్మేంట్ సిస్టం, రెండోది ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టం, మూడోది ఎనర్జీమెనేజ్ మెంట్ సిస్టం సిర్టిఫికెట్లను ప్రధానం చేసినట్లు చెప్పారు. మూడు సర్టిఫికెట్లు 2027వ సంవత్సరం వరకు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ వేణుగోపాల్, రిజిస్ట్రార్ దామోదర్‌రెడ్డి తదితరులున్నారు.