కార్పొరేషన్, నవంబర్ 22 : నగరంలోని సమీకృత వెజ్, నాన్ వెజ్ మారెట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్తో కలిసి సమీకృత మారెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు.
ఇకడ విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులతో కలెక్టర్ మాట్లాడారు. ఆరోగ్య మహిళా వైద్య పరీక్షలు చేయించుకున్నారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ కార్మికుల కోసం ప్రత్యేక క్యాంపు ల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, ఈఈ సంజయ్ కుమార్, శానిటరీ సూపర్వైజర్ తదితరులు ఉన్నారు.