Clean meals | ధర్మారం, ఆగస్టు 30: విద్యార్థినులకు పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని ఎస్టి గురుకుల విద్యాలయ సిబ్బందికి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల విద్యాలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. మధ్యాహ్నం సమయంలో ఆయన సందర్శించి డైనింగ్ హాల్ ను భోజనం చేస్తున్న బాలికలను కలిసి పరిశీలించారు. భోజనం ఎలా ఉందని బాలికలతో ఆయన మాట్లాడారు.
శుచికరమైన భోజనం అందించడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా విద్యాలయంలో వంట సామాగ్రి నిలువ రికార్డులను ఆయన పరిశీలించారు. విద్యార్థినులకు అందుతున్నతాగునీటిని గురించి ప్రిన్సిపాల్ శ్రీలతను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రతిరోజు వండుతున్న కూరగాయలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వానకాల సీజన్ లో అప్రమత్తంగా ఉంటూ విద్యార్థినులకు రుచి, శుచికరమైన భోజనాన్ని అందిస్తే వారు ఆరోగ్యకరంగా ఉండి పాఠశాలలో ఆహ్లాదకరంగా విద్యను అభ్యసిస్తారని అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని, తాజా కూరగాయలను ఉండాలని వంట సిబ్బందికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీలత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.