 
                                                            Kadambapur | సుల్తానాబాద్ రూరల్, అక్టోబర్ 31: పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబ పూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవారం కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన గోస్కుల సదయ్య చేపట్టారు. శుక్రవారం ఉదయం గ్రామంలో పర్యటించి రక్షిత తాగునీటి బావి, మురిగు కాలువల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లారు.
ఇండ్లలోని కుళాయిలు, డ్రమ్ములు, గోళాలల్లో నీటిని ఎక్కువ రోజులు నిలువ ఉంచుకోవద్దఅని గ్రామస్తులకు సదయ్య అవగాహన కల్పించారు. గ్రామస్తులు ఆరోగ్యంగా ఉండాలని, తన వంతు సహాయంగా గత కొంతకాలం నుంచి చేయడం జరుగుతుందని సదయ్య తెలిపారు.
 
                            