రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కేంద్ర బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం సంపన్నులు, కార్పొరేట్ శక్తులకే ప్రయోజనాలు, ప్రాధాన్యతనిస్తున్నదని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సీఐటీయూ నిరసన తెలిపింది. రూ.12 లక్షల వరకు పన్ను మినహాయింపును బడ్జెట్లో ప్రకటించినా, పాత పద్ధతిలో ఎటువంటి మార్పులనూ ప్రస్తావించక పోవడం నష్టమేనన్నారు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరివ్రమల్లో ఉపాధి కల్పన, కార్మిక భద్రతకు అంశాలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించక పోవడం అన్యాయమన్నారు. విభజన హామీ చట్టంలోని అంశాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ పదేళ్ల తర్వాత కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. నిరసనలో నాయ కులు అన్నల్దాస్ గణేశ్, తదితరులు పాల్గొన్నారు.