MLA Kalvakuntla Sanjay | కోరుట్ల, సెప్టెంబర్ 26: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి యువతకు ఆదర్శనీయమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో మున్సిపల్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చాకలి ఐలమ్మ మహిళ కాదని తెలంగాణ ఉద్యమ చరిత్రలో అజరామరమైన శక్తి అని పేర్కొన్నారు.
నల్గొండ జిల్లా సాయుధ పోరాటాల్లో ఆమె చూపిన తెగువ, ధైర్యం, అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటం భావితరాలకు మార్గ దర్శకం అన్నారు. తెలంగాణ మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని, సమాజంలో న్యాయం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలనీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీందర్, వివిధ పార్టీల నాయకులు జువ్వాడి కృష్ణారావు, దారిశెట్టి రాజేష్, చేన్న విశ్వనాథం సుతారి రాములు, చింత భూమేశ్వర్, పేర్ల సత్యం, మహమ్మద్ అతిక్, పోట్ట సురేందర్, సందయ్య,చిత్తరీ ఆనంద్, ఎక్కల్ దేవి నవీన్ కుమార్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.