Chada Venkat Reddy | చిగురుమామిడి, ఆగస్టు 20 : చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామంలో ది హాలిక్ శ్రమజీవి కోపరేటివ్ సొసైటీ డైరెక్టర్ పరుపాటి కనకవ్వ ఇటీవల మృతిచెందగా ఆ కుటుంబాన్ని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
సొసైటీలో డైరెక్టర్ గా చాలా సంవత్సరాలుగా కొనసాగుతుందని చాడ కొనియాడారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా సీపీఐ అండగా ఉంటుందని అన్నారు. ఆయన వెంట సింగిల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు మండల కొమురయ్య తదితరులు ఉన్నారు.