Chigurumamidi | చిగురుమామిడి, అక్టోబర్ 8 : చిగురుమామిడి మండలం రేకొండ ది హాలిక్ శ్రమజీవి కో ఆపరేటీవ్ సొసైటీ నుండి చాడ శ్రీధర్ రెడ్డికి బెంగుళూరులో ఉన్న ఇప్కో కంపెనీ వ్యవసాయ రంగ నాన్ యూరియా, డీఏపీ ఉత్పత్తుల పరిశీలనకు ఆహ్వానం అందింది. ఈ మేరకు బెంగళూరులోని ఇప్కో కంపెనీకి చెందిన నాన్ యూరియా డీఏపీల తయారీ విధానం శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. లిక్విడ్ రూపంలో మొక్కలకు అందించే నూతన ప్రక్రియ ఇప్కో కంపెనీ చేపట్టడం జరిగిందని, వాటి పరిశీలనకు రైతుల పక్షాన వెళ్లినట్లు శ్రీధర్ రెడ్డి తెలిపారు.
రైతులకు భూసార పంటలకు హాని కలగకుండా లిక్విడ్ విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. లిక్విడ్ పద్ధతితో మొక్కకు నేరుగా కాండం నుండి ఆకుల పెరుగుదల, కాయ ఉత్పత్తి నాణ్యతగా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. కరీంనగర్ ఇప్కో డిఎం శ్రీధర్, చొప్పదండి సీఈవో తిరుపతిరెడ్డి పాల్గొన్నట్లు శ్రీధర్ రెడ్డి తెలిపారు.