Chigurumamidi | చిగురుమామిడి, నవంబర్ 17 : మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మండల కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ కాంతారావు తెలంగాణ ఉద్యమంలో చేసిన సేవలను కొనియాడారు. మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని అన్నారు.
బీఆర్ఎస్ బలోపేతం కోసం కెప్టెన్ విశేషంగా కృషి చేశారని అన్నారు. వారి అడుగుజాడల్లోనే వారి కుమారుడు మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ ముందుకు వెళుతున్నాడని అన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ జన్మదిన వేడుకల్లో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, మండల నాయకులు ఆర్కే చారి, పెనుకుల తిరుపతి, బెజ్జంకి రాంబాబు, ముక్కెర సదానందం, గిట్ల తిరుపతిరెడ్డి, నాగేల్లి రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.