భవిష్యత్తుతో ఆటలు ఆడద్దు
విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ సరార్ ఆటలు ఆడొద్దని బీఆర్ఎస్వీ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ హితవు పలికారు. స్కిల్ వర్సిటీలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
- బీఆర్ఎస్వీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్ కుమార్ గౌడ్
కమాన్చౌరస్తా, ఆగస్టు 20 : విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ సరార్ ఆటలు ఆడొద్దని బీఆర్ఎస్వీ కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ హితవు పలికారు. స్కిల్ వర్సిటీలో విలీనం చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రేవంత్ రెడ్డి సరారు పేద విద్యార్థులను సాంకేతిక విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయలేక పాలిటెక్నిక్ విద్యార్థులను ప్రైవేట్ వర్సిటీలవైపు నెట్టివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గతంలో పాలిటెక్నిక్ ముగిశాక నేరుగా ఇంజినీరింగ్ సెకండియర్లోకి (లెటరల్ ఎంట్రీ) అవకాశం ఉండేదని, కానీ ఈ విలీనం వల్ల ఆ అవకాశం కోల్పోయే ప్రమాదముందని, మళ్లీ రెండేళ్లు ఇంటర్ చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అంతే కాకుండా విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలుపుతున్న పాలిటెక్నిక్ విద్యార్థులపై క్రూరంగా వ్యవహరించారని, ఓ సీఐ విద్యార్థి గొంతు నొక్కారని, తక్షణమే ఆ పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో విద్యార్థులకు ప్రభుత్వం బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, నాయకులు ఆరే రవి గౌడ్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు గంగాధర చందు, నారదాసు వసంత్ రావు, బండ వేణు యాదవ్, సోమిరెడ్డి నరేశ్ రెడ్డి, వడ్లకొండ పర్షరాం, గంటల రేణుక, విక్రమ్, శనిగరం సతీశ్, పెరుమాండ్ల హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

