సిరిసిల్ల టౌన్, మార్చి 5: ‘నేతన్నల మాఫియా’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మశాలీలను అవమానపరిచిన రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డికి నేతన్నలు, బీసీల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బీసీల గురించి రేవంత్‌రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను మరిచిపోయిండని, కానీ ఆత్మగౌరవం కలిగిన బీసీ బిడ్డలు ఇంకా మరిచిపోలేదన్నారు.
నేతన్నల గురించి ఆయన మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుందన్నారు. గతంలో రేవంత్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ కానీ, ప్రస్తుత కాంగ్రెస్ నేతగా గానీ నేతన్న సంక్షేమానికి చేసిన ఒక్క మంచి పనైనా ఉందా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే ఎక్స్‌గ్రేషియా కోసమే నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, నేతన్నలు తాగుబోతులంటూ మాట్లాడిన పార్టీల ప్రతినిధి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ. 1200 కోట్లు ఇచ్చి వారి నేతన్నల అభ్యున్నతికి పాటుపడిందని స్పష్టం చేశారు. నేతన్నల సంక్షేమం కోసం ప్రతి ఏడాది వందల కోట్లు కేటాయిస్తున్నదన్నా రు. నేతన్నల ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వచ్చి వాటి గురించి మాట్లాడడం ఆత్మవంచనగానే పరిగణిస్తున్నామన్నారు. సిరిసిల్లలో నేతన్నల మాఫియా అని రేవంత్‌రెడ్డి పద్మశాలీలను అవమానపరిచిండని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకప్పుడు సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడిన నేతన్నలు ఈరోజు తమ కాళ్లపై నిలబడితే ఓర్వలేక వారి గురించి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నాడన్నారు. కొండా లక్ష్మణ్‌బాపూజీ గురించి మా ట్లాడడం బాధాకరమన్నారు.
కాంగ్రెస్ హయాం లో కొండాలక్ష్మణ్ గురించి చేసిన ఒక్క మంచి పనైనా ఉందో చెప్పాలన్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ మహనీయుడి పేరుని హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టుకున్నామని, హైదరాబాద్‌లో పద్మశాలీలంతా గర్వపడే విధంగా అదే జలదృశ్యం వద్ద అద్భుతమైన విగ్రహం ఏర్పాటు చేసుకున్నామన్నారు. మంత్రి కేటీఆర్ గురించి మాట్లాడే అర్హత, స్థాయి రేవంత్‌రెడ్డికి లేదన్నారు. జైలులో చిప్పకూడు తిని వచ్చిన రేవంత్‌రెడ్డి స్థా యి కేటీఆర్ అంత స్థాయి కాదని గుర్తెరగాలన్నా రు. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే ఇదే సిరిసిల్ల వేదికగా సిరిసిల్ల అభివృద్ధికి, పద్మశాలీల అభివృద్ధికి మేము చేసిన కార్యక్రమాలపై మాతో చర్చకు రావాలని స వాల్ విసిరారు.
ఉద్యమంలో కేటీఆర్ అన్న భాగస్వామ్యం గురించి మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.. చంద్రబాబు పంచన చేరి తెలంగాణ ప్రజల ఆత్మహత్యలకు కారణమై, ఉద్యమానికి ద్రోహం చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. రేవంత్ రెడ్డి సభ నిర్వహించిన ప్రదేశాన్ని గోమూత్రంతో శుద్ది చేసినా ఆ ప్రాంతం పవిత్రం కాదన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించి ఓటు వెయ్యాలని ప్రజలను రేవంత్‌రెడ్డి కోరాల్సిన అవసరం లేదని, ఉద్యమ సమయంలో వందల మంది ఆత్మహత్యలకు కారణమైన కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఆలోచించే 2014లో ఓటు వేశారని, తెలంగాణ నుంచి తన్ని తరిమివేశారని ఎద్దేవా చేశారు.
చెల్లని రూపాయిని రుద్దాలని చూస్తున్నరు: టీపీటీడీసీ చైర్మన్ గూడూరి
అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఓడిన చెల్లని రూపాయిని తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు మళ్లీ సిరిసిల్ల ప్రజలకు రుద్దాలని చూస్తున్నారని, అప్పుడు చెల్ల ని రూపాయి ఇప్పుడెలా చెల్లుతుందని టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ ప్రశ్నించారు. కేటీఆర్‌ను విమర్శించే స్థాయి, కేటీఆర్‌కు పోటీగా నిలిచే వ్యక్తి కాంగ్రెస్‌లోనే లేడన్నారు. జైలుకు వెళ్లి చిప్పకూడు తిని వచ్చినా రేవంత్‌రెడ్డి వక్రబుద్ధి మాత్రం ఏమా త్రం మారలేదన్నారు. అవే చిల్లర మాటలు, అదే చిల్లర వ్యవహారం కొనసాగిస్తున్నాడన్నారు. నేతన్నలపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడన్నారు.
పాదయాత్ర సందర్భంగా కనీసం అదే ప్రాంతంలో ఉన్న కొండా లక్ష్మణ్‌బాపూజీ, నేతన్న విగ్రహాలకు పూలదండ కూడా వేయని మూర్ఖుడు అని విమర్శించారు. గతంలో నేతన్నల ఆత్మహత్యలు జరిగినప్పుడు కనీసం స్పందించలేదన్నారు. మనసున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నేతన్న కోసం అనేక పథకాలు అమలుచేస్తున్నారని, బతుకమ్మ చీరల తయారీతో చేతినిండా ఉ పాధి కల్పిస్తున్నారని చెప్పారు. ఇసుక మాఫియా గురించి మాట్లాడారని, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఏడాదికి రూ.800కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాలో చేరుతున్నదని, కాంగ్రెస్ హయాంలో ఈ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
కంటి వెలుగులోటెస్ట్లు చేయించుకోవాలె: జడ్పీ చైర్పర్సన్ అరుణ, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ నర్సయ్య
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని, మంత్రి కేటీఆర్ హయాంలో సిరిసిల్ల రాష్ర్టానికే ఆదర్శంగా అభివృద్ధి సాదించిందని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య అన్నారు. పాదయాత్రగా వస్తున్న రేవంత్‌రెడ్డికి రోడ్ల వెంట పచ్చని పొలాలు, అభివృద్ధి పనులు కనిపించకపోవడం బాధాకరమన్నారు.
కంటి వెలుగు పథకంలో రేవంత్ పరీక్షలు చేయించుకోవాలని హితవుపలికారు. చరిత్రలో లేని వి ధంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందిందన్నా రు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాతనాన్ని మరిచి చిల్లర మాటలు మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు. రాబోవు రోజుల్లో తెలంగాణలో కాం గ్రెస్‌ను ప్రజలు బొందపెడతారన్నారు. ఇక్కడ బీ ఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి మ్యాన రవి, ఉపాధ్యక్షుడు సత్తార్, ము న్సిపల్ కోఆప్షన్ సభ్యుడు సలీం, అడ్డగట్ల మురళి, మునీర్, రీనా బాబా పాల్గొన్నారు.