ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 1: మండలంలోని పలు అధికారిక కార్యక్రమాలను కలెక్టర్ సందీప్‌కుమార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డితో కలిసి నిర్వహించడంపై ప్రోటోకాల్ అనేది లేకుండా కార్యక్రమం నిర్వహించారా అని పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు.
శుక్రవారం మండల కేంద్రంలోని కిషన్దాస్పేటలోని అంగన్వాడీ నూతన భవనం, ఎంజేపీ కళాశాలలో అన్అకాడమీ ఆన్లైన్ క్లాసులను ఇద్దరు కలిసి ప్రారంభించారు. అయితే మండలంలో ప్రజాప్రతినిధిగా ఉన్న సెస్ డైరెక్టర్ వర్స కృష్ణహరి, పీఏసీఎస్ చైర్మన్‌గా ఉన్న గుండారపు కృష్ణారెడ్డికి సమాచారం కూడా లేకపోవడంతో వారు అసహనం వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా సంక్షేమాధికారి పీ. లక్ష్మీరాజంను వివరణ కోరగా నూతన అంగన్వాడీ భవన నిర్మాణాలపై గుంతలు తవ్వారు – నిర్మాణం మరిచారు పేరిట రాజన్నపేటలో నిలిచిన అంగన్వాడీ పాఠశాల నిర్మాణం లాంటి వార్తల నేపథ్యంలో పూర్తయి ఉన్న భవనాన్ని ప్రారంభించుకునేందుకు తీసుకున్న నిర్ణయమని మిగతా భవనాల నిర్మాణలు త్వరలోనే పూర్తవుతాయని సదరు భవనాల ప్రారంభానికి అందరికి సమాచారమిస్తామని తెలిపారు.