గెలిచినా.. ఓడినా ప్రజల మధ్యలోనే
‘గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా. కష్టాల్లో తోడుంటా. దీటైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల్లో పాలుపంచుకుందాం’ అని వేములవాడ బీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు భరోసానిచ్చారు.
- దీటైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల్లో పాలుపంచుకుందాం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం
- బీఆర్ఎస్ నేత చల్మెడ లక్ష్మీనర్సింహారావు
వేములవాడ, డిసెంబర్ 14: ‘గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా. కష్టాల్లో తోడుంటా. దీటైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల్లో పాలుపంచుకుందాం’ అని వేములవాడ బీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు భరోసానిచ్చారు. గురువారం వేములవాడలోని ఆయన నివాసంలో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా, హాజరై మాట్లాడారు. ప్రజా జీవితంలో గెలుపోటములు సహజమేనని, నా కోసం అహర్నిశలూ పనిచేసిన కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు.
దీటైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల్లో ఎప్పటికప్పుడు పాలుపంచుకొని ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉందామని పిలుపునిచ్చారు. పదమూడేండ్లుగా రాష్ట్ర సాధనే ధ్యేయంగా కొట్లాడి తెచ్చిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన మనమందరం మళ్లీ ప్రజల పక్షాన పని చేద్దామన్నారు. గెలుపోటములతో పనిలేదని వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
మాదంతా బీఆర్ఎస్ కుటుంబమని, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కీలకంగా వ్యవహరిస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి, వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆది శ్రీనివాస్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటుదామని చెప్పారు. పార్టీ కోసం నిజాయితీగా పని చేసేవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, వెన్నుపోటు దారులు ఎవరైనా ఉంటే వారితోనే ప్రమాదమని చెప్పారు. సమావేశంలో జడ్పీచైర్‌పర్సన్ న్యాలకొండ అరు ణ,
మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్‌రావు, ఎంపీపీలు బండ మల్లేశం యాదవ్, చంద్రయ్య గౌడ్, గంగం స్వరూపారాణి, రేవతి, జడ్పీటీసీలు మ్యాకల రవి, గట్ల మీనయ్య, నాగం భూమయ్య, పార్టీ సీనియర్ నాయకులు లోక బాపురెడ్డి, ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, తీగల రవీందర్ గౌడ్, సెస్ డైరెక్టర్లు రేగులపాటి హరిచరణ్ రావు, ఆకుల దేవరాజు, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగరాజం, పార్టీ అధ్యక్షులు గోసుల రవి, మల్యాల దేవయ్య, గంగ ప్రసాద్, సత్తిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు సల్మాన్ రెడ్డి, రామ్మోహన్ రావు, కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

