Voditela Satish Kumar | త్వరలోనే బీఆర్ఎస్ కమిటీల ఏర్పాటు.. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి గ్రామస్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, అలాగే గ్రామ కమిటీలను ఎన్నుకుంటామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు.
Voditela Satish Kumar | చిగురుమామిడి, అక్టోబర్ 9 : హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి గ్రామస్థాయి నుండి పార్టీని మరింత బలోపేతం చేస్తామని, అలాగే గ్రామ కమిటీలను ఎన్నుకుంటామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని, వాటిపై ప్రజలు ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాలు పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిపై పోరాటాలు చేస్తామన్నారు.
చిగురుమామిడి మండల కేంద్రంలో ఈనెల 15న మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహిస్తామన్నారు. రైతులకు సరిపడా కరెంటు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, భూగర్భ జలాలు లేక పంటలు ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో రైతన్నలు ఉన్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో గోదావరి జలాలతో పంటలన్నీ సస్యశ్యామలంగా ఉన్నాయని, నేడు పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొందని అన్నారు. వాస్తవ పరిస్థితులను నియోజకవర్గ ప్రజలు గమనించాలని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మామిడి అంజయ్య, కానుగంటి భూమిరెడ్డి, రామోజు కృష్ణమాచారి, ఎండీ సర్వర్ పాషా, కూతురు శరభంద రెడ్డి, దేశిని రాజయ్య, బెజ్జంకి రాంబాబు, బెజ్జంకి లక్ష్మణ్, కాశబోయిన రాజు, దొనపాటి కృష్ణారెడ్డి, సదానందం వివిధ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
Nithin | నితిన్ కంబ్యాక్‌పై ప్రత్యేక ఫోకస్.. ‘అలియాస్ రుక్మిణి’ రిలీజ్ డేట్ ఫిక్స్!
Constable Suicide | కుటుంబ కలహాలతో కానిస్టేబుల్ ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

