KARIMNAGAR | కమాన్ చౌరస్తా, మే 7 : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ హరిహర క్షేత్రం ప్రాంగణంలోని వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, శివాలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ యాగంట్ల అనిల్ కుమార్ గౌడ్, కొస్న కాంతరెడ్డి, అర్చకులు రాజేశ్వర శర్మ, శ్రీనివాస శర్మ, చాణక్య, గోపాలకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.