Dharmaram | ధర్మారం, సెప్టెంబర్ 27 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పాత బస్టాండ్ – బోయవాడ లో ప్రతిష్టించిన మండపంలో కొలువైన మహా గణపతి వద్ద జరిగిన లడ్డూ రూ.80,116 వేలం పలికింది. ఈ మేరకు ఆదివారం గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు గణేశుడి లడ్డుకు వేలంపాట నిర్వహించారు. ఈ లడ్డు దక్కించుకోవడానికి ఎంతో మంది వేలంపాడి పోటీపడ్డారు. ఈ వేలం పాట ఎంతో ఆసక్తికరంగా జరిగింది. ఈ క్రమంలో హై రేంజ్ లో వేలంపాడి ధర్మారం గ్రామానికి చెందిన దాగేటి ఉదయ్ యాదవ్, మొహమ్మద్ యాదుల్
(గరుడ టీమ్) రూ.80,116లకు దక్కించుకున్నారు.