Taekwondo | వేములవాడ, డిసెంబర్ 13 : తైక్వాండో లో ఏడుగురు బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డన్ సాధించారని తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కోశాధికారి గందె సంతోష్ కుమార్ తెలిపారు. వేములవాడ పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జోగులాంబ గద్వాలలో తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన పుంసే సెమినార్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఏడుగురు బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డన్ తీసుకున్నారన్నారు.
కొరియన్ ఎంబసీ మెంబర్, ఇంటర్నేషనల్ రెఫ్రి, మాస్టర్ వాన్ యంగ్ లి చేతుల మీదుగా మంగళగిరి శ్రీనివాస్ (సుద్దాల), రాచకొండ విజయసింహచారి (నాంపల్లి), అవధూత రజినీకాంత్ (వేములవాడ), దండుగుల తిరుపతి (నాంపల్లి), దండుగుల దేవయ్య ( నాంపల్లి), దండుగుల శంకర్ (నాంపల్లి), లోలపు రాజు (నాంపల్లి) బ్లాక్ బెల్ట్, సర్టిఫికెట్ పొందారని సంతోష్ కుమార్ తెలిపారు. బెల్టులు సాధించిన ఏడుగురిని కొరియన్ మాస్టర్ వాన్ యంగ్ లీ తోపాటు తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీహరి అభినందించారు.