Kalvasrirampoor | కాల్వ శ్రీరాంపూర్ జూన్ 3 : భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి కార్యక్రమాలను నిర్వహిస్తుందని పెద్దపెల్లి ఆర్డీవో గంగయ్య అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ గంగారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులకు ఆర్డీవో గంగయ్య హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జగదీశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఆర్ఐ లు నిహారిక, వహజతుల్లా, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.