Bharatiya Kisan Sangh | మల్లాపూర్, ఆగస్టు 17: గ్రామాల్లో పార్టీలకు అతీతంగా భారతీయ కిసాన్ సంఘ్ ను బలోపేతం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ సంఘటన్ మంత్రి దోనూరి రాము అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక రైతువేదిక కార్యాలయంలో భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులతో శిక్షణ తరగతులను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు కలిసికట్టుగా ఐక్యంగా ఉంటే రైతుల ప్రతీ సమస్య వెంటనే పరిష్కారమవుతాయని, గ్రామాల్లోని రైతులు సమస్యలను నిత్యం ఎదుర్కొంటున్నారన్నారు.
ప్రతీ గ్రామంలో పార్టీలకు అతీతంగా భారతీయ కిసాన్ సంఘాన్ని బలోపేతం చేసేలా రైతులు కృషి చేయాలని కోరారు. రైతులు బాగుంటునే దేశం బాగుంటుందని, రైతులు ఐక్యంగా పోరాటాలు చేస్తే ఏ ప్రభుత్వాలైన దిగివస్తాయాని తెలిపారు. అనంతరం బలరాముడి విగ్రహం వద్ద ఘన నివాళులు ఆర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చేపూరి విజయభాస్కర్, జిల్లా అధ్యక్షుడు కాసారపు భూమారెడ్డి, జిల్లా కార్యదర్శి ఇప్ప రాజేందర్, మండలాధ్యక్షుడు కల్లెం మహిపాల్ రెడ్డి, నాయకులు ముద్దం గంగారెడ్డి, చిట్యాల లక్ష్మణ్, ఇట్టెడి భాస్కర్, మిట్టపల్లి జలపతిరెడ్డి, మొరపు గంగరాజం, పోచంపల్లి రమేష్, ముత్యాల గంగరాజం, ఇస్లావత్ రాజేందర్, కాటిపల్లి రాజేంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.