GodavariKhani | భళా… చేనేత హస్త కళా.. గోదావరిఖనిలో కొలువు దీరిన మేళా…
‘చేనేతలను ప్రోత్సహిద్దాం.. హస్త కళలను ఆదరిద్దాం..’ లక్ష్యంతో గోదావరిఖని జీఎం కాలనీలో గల అర్జీ-1 కమ్యూనిటీ హాలులో కళాభారతి హ్యాండ్లూమ్స్ సంస్థ ఆధ్వర్యంలో చేనేత, హస్త కళా మేళా కొలువుదీరింది. ఈమేరకు సింగరేణి ఆర్జీ-1 ఎస్ఓటూ జీఎం చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది.
- ఆరు రాష్ట్రాల ఉత్పత్తుల ప్రదర్శన
GodavariKhani | కోల్ సిటీ, ఫిబ్రవరి 7: ‘చేనేతలను ప్రోత్సహిద్దాం.. హస్త కళలను ఆదరిద్దాం..’ లక్ష్యంతో గోదావరిఖని జీఎం కాలనీలో గల అర్జీ-1 కమ్యూనిటీ హాలులో కళాభారతి హ్యాండ్లూమ్స్ సంస్థ ఆధ్వర్యంలో చేనేత, హస్త కళా మేళా కొలువుదీరింది. ఈమేరకు సింగరేణి ఆర్జీ-1 ఎస్ఓటూ జీఎం చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది. దేశంలోని ఆరు రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ కళా నైపుణ్యంతో తయారు చేసిన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలను నేరుగా తయారీదారులతోనే ప్రదర్శించడం మేళా ప్రత్యేకత.
విదేశీ ఉత్పత్తులకు దీటుగా ప్రపంచ దేశాలను అబ్బురపరిచే చేనేత, హస్త కళాకారులను ప్రోత్సహించే విధంగా హైదరాబాద్లోని కళాభారతి సంస్థచే నిర్వహిస్తున్న మేళాను సందర్శించి ఆదరించాల్సిన బాధ్యత కోల్ బెల్ట్ ప్రజలపై ఉందని సింగరేణి ఎస్ఓటు జీఎం కోరారు. కళాభారతి నిర్వాహకులు సత్యనారాయణ మాట్లాడుతూ కాగా, రోజూ ఉదయం 10గం.ల నుంచి రాత్రి 9గం.ల వరకు కొనసాగే ఈ మేళాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్నాటక, జైపూర్, న్యూఢిల్లీ తదితర రాష్ట్రాల్లోని కళాకారులు తయారు చేసిన వివిధ రకాల కళాత్మక వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు, కొండపల్లి బొమ్మలు స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు.
నేరుగా కళాకారులతోనే అమ్మకాలు చేయించడం మేళా ప్రత్యేకత అని పేర్కొన్నారు. చేనేత కళాకారులకు ఆర్థిక చేయూత అందించడమే లక్ష్యంగా ప్రతి ఏటా నిర్వహిస్తుందన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కార్మికులు తాము తయారు చేసిన ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో నేరుగా అమ్మకాలు చేస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణంగా..
ఈ మేళాలో చేనేత వస్త్రాలతోపాటు హస్త కళలు, తినుబండారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పోచంపల్లి బెడ్ షీట్లు, కళంకారి, మంగళ గిరి, వెంకటగిరి, ఉప్పాడ చీరలు, పొందూరు చేబ్రవోలు, ఖాదీ వస్త్రాలు, డ్వా క్రా ఉత్పత్తులు, ఆయుర్వేద ఔషధాలు, మగువల మనసు దోచే గోల్డ్ అభరణాలు అమ్మకాలకు ప్రదర్శనగా ఉంచారు.
అలాగే కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక బొమ్మలు హైదరాబాద్ ముత్యాలు, ఖాదీ గ్రామోద్యోగ్ ఆయుర్వేద ఔషధాలు, లెనిన్ బ్యాగులు, ఇమిటేషన్ జ్యలరీ, గృహ ఉపకరణ వస్తువులు, మైసూర్ రోజ్ ఫుడ్, కళాత్మక ఆభరణాలు, బాంగిల్స్, బ్రాస్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయని నిర్వాహకులు సత్యనారాయణ తెలిపారు. ఈనెల 18వ తేదీ వరకు మాత్రమే మేళా కొనసాగుతుందనీ, పారిశ్రామిక ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, చేనేత కళాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, చేనేత హస్త కళాకారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

