Bhagya Reddy Varma | జగిత్యాల, మే 22 : మ్యాదరి భాగ్య రెడ్డి వర్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని జగిత్యాల కలెక్టర్ బీ సత్య ప్రసాద్ అన్నారు. కలెక్టర్ బీ సత్య ప్రసాద్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో గురువారం మ్యాదరి భాగ్యరెడ్డి వర్మ 137వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్య రెడ్డి వర్మ చిత్రపటానికి కలెక్టర్ బీసత్య ప్రసాద్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ, భాగ్యరెడ్డి వర్మ, దళిత వైతాళికుడిగా ప్రసిద్ధి చెందారని కొనియాడారు. హైదరాబాద్ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడని, మన్యసంఘం, సంఘ సంస్కార నాటకమండలి , అహింసా సమాజం లను స్థాపించి హైదరాబాద్ ప్రాంతంలో సంఘ సంస్కరణలకై కృషి చేసాడని పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, ఎస్సీ సంక్షేమ అధికారి రాజ్ కుమార్, దళిత సంఘ నాయకులు జిల్లా అధికారులు, కలెక్టరెట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.