Beerappa Bonalu | చిగురుమామిడి, జులై 6 : తొలి ఏకాదశి పర్వదిన పురస్కరించుకొని మండలంలోని రేకొండ గ్రామంలోని పెద్దమ్మ పల్లెలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరయ్య బోనాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇంటింటా మహిళలు బోనాలతో బయలుదేరగా యువకులు డప్పు, చప్పులతో విన్యాసాలు చేస్తూ నృత్యాలు చేశారు. ఊరి పొలిమేరలో ఉన్న బీరప్ప దేవాలయం వద్దకు వెళ్లి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రతీ ఏటా తొలి ఏకాదశి రోజున బోనాలను తీసుకెళ్లి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని కురుమ సంఘ పెద్దలు తెలిపారు. ఈ వేడుకల్లో కురుమ సంఘ పెద్దలు కొంగోండ చేరాలు, కంప కుమార్, పి క్కాల అంజయ్య, లింగయ్య, శ్రీనివాస్, పీరళ్ళ అజయ్, పీరళ్ల కుమారస్వామి, పీరల్ల రాజ్ కుమార్, పీరల్ల రామకృష్ణ, పీరళ్ళ రాహుల్, ప్రవీణ్, రవీందర్, తిరుపతి, తదితరులు ఉన్నారు.