నాడు సంక్షోభంలో కూరుకుపోయి, మరణమే శరణ్యమనుకున్న సిరిసిల్ల నేతన్నలకు స్వరాష్ట్రంలో పునర్జీవం పోసిన బతుకమ్మ చీరెల తయారీ మళ్లీ మొదలుకాబోతున్నది. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ పవర్‌లూం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏడు కోట్ల మీటర్ల వస్త్రం, కోటి చీరెల తయారీకి ముందస్తుగానే రూ.350 కోట్ల చీరెల ఆర్డర్ ఇవ్వగా, తీరొక్క రంగులు, సరికొత్త డిజైన్లతో తయారీకి రంగం సిద్ధమవుతున్నది. సూరత్, ముంబైకి చెందిన డిజైన్ మాస్టర్లతో రూపకల్పన జరుగుతుండగా, మొత్తంగా 20వేల మంది కార్మికులకు చేతి నిండా పని దొరుకనున్నది.
రాజన్న సిరిసిల్ల, మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా సర్కా రు అందిస్తున్న చీరెలను సరికొత్త డిజైన్లతో త యారీకి సర్వం సిద్ధమవుతున్నది. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాలతో తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ పవర్‌లూం డెవలప్మెం ట్ కార్పొరేషన్ రూ.350 కోట్ల అంచనా తో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఏడు కోట్ల మీటర్ల వస్త్రం తో కోటి చీరెల తయారీకి ముందస్తుగా ఆర్డర్లు ఇవ్వగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
స్వరాష్ట్రంలోనే బతుకు..
సమైక్య పాలనలో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయి, మరణమే శరణ్యమనుకున్న నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. బతుకమ్మ కానుకగా ఆడబిడ్డలకు ఉచితంగా అందిస్తున్న వందల కోట్ల చీరెల తయారీ ఆర్డర్లు ఇస్తూ బతుకులకు భరోసా కల్పించింది. నాడు పొట్ట చేతబట్టుకుని ముంబై, భీవండీ, సూరత్‌కు వెళ్లి, దుర్భరమైన జీవితాలు గడిపిన కార్మికులు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు ఇచ్చిన భరోసాతో తిరిగివచ్చి చేతినిండా ఉపాధి పొం దుతున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చొరవతో ఏటా రూ. వందల కోట్లతో బతుకమ్మ చీరెలు, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాంల వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు సిరిసిల్లకు ఇప్పిస్తున్నారు. అమాత్యుడి ఔదార్యం తో ప్రతి కార్మికుడికి చేతినిండా పని, నెలకు రూ.20వేలు సంపాదిస్తున్నారు. ఫలితంగా నా డు వలస వెళ్లిన కార్మికులు తిరిగి వాపస్ రావడంతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిషాలకు చెందిన వందలాది మంది కార్మికులు సిరిసిల్లకు వచ్చి ఉపాధి పొందుతున్నారు.
మరమగ్గాలకు మహర్దశ..
రాష్ట్ర సర్కారు చొరవతో మరమగ్గాలకు మహర్దశ వచ్చింది. చేనేత, మరమగ్గాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బడ్జెట్లో అధిక నిధులు కేటాయిస్తూ వస్తున్నది. పాతకాలపు సాంచాల ఆధునీకరణ, చీరెలకు వినియోగించే నూలు, విద్యుత్ రాయితీలు ఇచ్చి భరోసాని చ్చింది. రైతుల మాదిరిగా నేతన్నలకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. ఎల్ఐసీ ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఈ విధంగా అన్ని విధాలుగా వస్త్ర పరిశ్రమకు, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందున పరిశ్రమ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతున్నది.
ముందస్తుగానే రూ.350కోట్ల ఆర్డర్..
రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులకు, అందులో 18 ఏండ్లు నిండిన ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ కానుకగా ప్రభుత్వం కోటికి పైగా చీరెలను ఉచితంగా అందిస్తున్నది. పం డుగ అక్టోబర్‌లో ఉండగా ఏడు నెలల ముందు గానే రూ.350 కోట్ల అంచనాతో 7కోట్ల మీటర్ల ఉత్పత్తితో కోటి చీరెల తయారీకి ఆర్డర్లు ఇస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ టెక్స్టైల్స్ అండ్ పవర్‌లూం డెవలప్మెం ట్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ద్వారా జీవో కా పీ సిరిసిల్ల చేనేత జౌళీ శాఖకు తాజాగా అందించింది. ఏటా ఏప్రిల్ నెలలో ఆర్డర్లు వ స్తుండేవి. ఈ సారి ముందస్తుగానే ఆర్డర్లు ఇవ్వడంతో నేతన్నలు సంతోషపడుతున్నారు.
తీరొక్క డిజైన్లు..
కోటి చీరల ఆర్డర్ రావడంతో సరికొత్త డిజైన్‌తో బ్లౌజ్ పీసు తయారు చేయనున్నారు. అందు లో చీరెలు సిరిసిల్ల మరమగ్గాలపై, 60లక్షల మీ టర్ల బ్లౌజ్ పీసు టెక్స్టైల్స్ పార్కులో తయారు చేయనున్నారు. వీటిని టెక్స్టైల్స్ పార్కులో రే పియర్, ఎయిర్జెట్లపైనే తయారీకి ఆర్డర్లు ఇ చ్చింది. ప్రస్తుత ఆర్డర్లతో 15వేల మరమగ్గాలపై కోటి చీరెల తయారీతో దాదాపు 20వేల మంది కార్మికులకు ఉపాధి లభించనుంది. పాత సాం చాలను డాబీ, జకార్డులుగా ఆధునీకరించారు. చీరెలకు పసిడి, వెండి అంచులు ఉండేలా రూ పొందిస్తున్నారు. గతంలో రెండు వందల డిజై న్లు, వంద రంగుల్లో తయారు చేశారు. ఈ సారి మరింత ఆకర్షణీయమైన రంగులు, ఆకట్టుకునేలా ముంబై, సూరత్‌లకు మాస్టర్లతో డిజైన్లు రూపకల్పన చేస్తున్నారు. త్వరలోనే ఎన్ని డిజై న్లు, ఎన్ని రంగులు అన్నది ఖరారు కానున్నది.
ముందుగానే అర్డర్లు..
బతుకమ్మ చీరెల ఆర్డర్లను ప్రభు త్వం ముందుగానే ఇ చ్చింది. సెప్టెంబర్ నెలాఖరులోగా కోటి చీరల లక్ష్యా న్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సారి ఆకర్షణీయమైన రంగులు, అందమైన డిజైన్లతో రూపకల్పన జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లతో నేతన్నలకు చేతి నిండా పని దొరుకుతున్నది. కోటి చీరల్లో 60లక్షల మీటర్ల బ్లౌజ్ పీసు ఉత్పతి ఆర్డర్‌ను సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్కులోని రేపియర్, జెట్లూంలకు ఇచ్చాం. డిజైన్లు, రంగులు త్వరలోనే ఖరారవుతాయి.
– అశోక్‌రావు, చేనేత జౌళీశాఖ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్