గుండెలోతుల్లోకి వెళ్లిన సినిమా ఇది
ప్రజల గుండెలోతుల్లోకి వెళ్లిన సినిమా బలగం అని, ఈ నేపథ్యంలో ఆదరించిన ప్రేక్షకుల మధ్య చిత్రం యూనిట్ సభ్యులను సన్మానించు కుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
- ప్రేక్షకులే మా బలగం :
- జ్యోతిబాఫూలే మైదానంలో బలగం చిత్రం సక్సెస్ మీట్
కమాన్‌చౌరస్తా, మార్చి 15: ప్రజల గుండెలోతుల్లోకి వెళ్లిన సినిమా బలగం అని, ఈ నేపథ్యంలో ఆదరించిన ప్రేక్షకుల మధ్య చిత్రం యూనిట్ సభ్యులను సన్మానించు కుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని జ్యోతిబాఫూలే మైదానంలో బుధవారం రాత్రి బలగం సక్సెస్ మీట్‌ను మంత్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిత్ర నిర్మాతలు దిల్ రాజు, హర్షిత్‌రెడ్డి, హనీ, దర్శకుడు ఎల్దండి వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య తదితరులు హాజరై సందడి చేశారు. సినిమాలోని పలు సన్నివేశాలను కండ్లకు కట్టేలా వివరించారు. చిత్రం విజయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పల్లెల యదార్థ గాథను అద్భుతంగా తెరకెక్కించడం అభినందనీయమన్నారు. ఈ భూమిమీద ఎవరూ శాశ్వతం కాదని, అంతిమంగా తమ కుటుంబాలకు ప్రేమ పంచాలని చూపించిన సినిమా బలగం అని అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ప్రేక్షకులే తమ బలగం అన్నారు. మేం నిర్వహించుకునే కార్యక్రమాలకు భిన్నంగా, మంత్రి, ప్రేక్షకులు మమ్మల్ని పిలిచి సక్సెస్ మీట్ నిర్వహించడం గొప్పగా భావిస్తున్నామన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, తాను చాలా రోజుల తర్వాత చూసిన మంచి సినిమా బలగం అన్నారు.
దర్శకుడు ఎల్దండి వేణు సిరిసిల్లలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. కరీంనగర్‌తో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. బలగం చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు భీమ్స్, గేయ రచయిత దాసర్ల శ్యామ్, నటీనటులు రచ్చరవి, విజయలక్ష్మి, మల్లయ్య, సౌమ్య, సత్యనారాయణ, సంజయ్, శ్రీకాంత్, సు ధాకర్ రెడ్డి, మురళీధర్ సందడి చేశారు. కార్యక్రమంలో మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణీహరిశంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

